Friday, July 23, 2010

డార్జీలింగ్ , ఈశాన్య భారతం లో నిశబ్దానికి అర్థం ?

జై హింద్ , నా తోటి భారతీయులారా !!!

ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం పిల్లల క్లాసు పుస్తకాలలో పనికి రానిఊకదంపుడు పేజీలు నింపడం కాదు . ఒక్కసారి ఆలోచించండి , మనం భారతీయులం అనే భావన చిన్నపుడే బలం గా మనస్సులు నాటుకోవాలి. దీనికోసం మన సంస్కృతి సంప్రదాయాలని తెలుసుకోవడానికి పిల్లల్ని దేశం లో ఇతర ప్రాంతాలకు పంపాలి. ఇది ఒక కార్యక్రం లా గా సిల్లబాస్ లో చేర్చాలి . లేదంటే మన దేశం లో మనమే పరాయి వాళ్ళల లాగ ఉండాల్సి వస్తుంది .
ఈశాన్య భరతం లోని వారికి భారత దేశం తో పెద్దగాసంబంధం అవసరం లేదు , వాళ్ళు మనల్ని కేవలం దోపిడీ దారుల్లగా నే చూస్తున్నారు , ఎంత అవమానకరం ?
మిజోరం, లేదా నాగాలాండ్ ముఖ్యమంత్రి ఎవరో మనలో ఎంత మందికి తెలుసు? మరి భారత ప్రధాని ఎవరో వారికి ఎం అవసరం? అందుకే నిజం చెప్పాలంటే వారు తమని తాము పరిపాలించుకొనే పరిస్తితి లో లేరు కాబట్టే ఇంకా వాళ్ళు ఇండియా లో కలిసి ఉన్నారు. ఇందులో భారతీయులు గర్వించ దగ్గ విషయం ఏమీ లేదు.
ఇప్పుడు చేయ గలిగే పరిష్కారం ఒక్కటే , సాంస్కృతిక సారుప్యత అర్థం చేసుకొనే అవకాసం కనీసం ఇప్పుడు మన తరువాతి తరాలకి అందించాలి . వీళ్ళని అక్కడికి పంపాలి , అక్కడి వారిని ఇక్కడకి ఆహ్వానిచాలి . ఏదో ఒకటి చేయాలి .
భారత మాత అనే ఒక భావన పటిష్టం గా ఉన్నపుడే , మనకు భవిష్యత్తు ఉంటుంది .

మీ సలహాలు ఏమైనా ఉంటె చెప్పండి..

ఐకమత్యం బలం కాదా??

మన ఘనత వహించిన కెసిఆర్ మనుషుల్ని మనసుల్ని విడగొట్టడం లో నిష్ణాతుడు .
ఆయన చరిత్ర ని కూడా విడగోడుతున్నాడు . శ్రీనాథ మహాకవి ని కోస్తా కవిగా , రామదాసు ని తెలంగాణా కవి గా, అన్నమయ్య ని రాయలసీమ కవి గా విడగొట్టి పారేసాడు . అసలు అప్పుడు తెలంగాణా ప్రాంతం విడిగా ఉండేదా? అసలు ఆ మాట ఉండేదా? కేవలం నిజాం ఆక్రమించిన తెలుగు ప్రాంతాలు ౧౯౪౭ తరువాత పరిగణ లోకి వచ్చిన తెలంగాణా అనే పదాన్ని పట్టుకుని విషం చిమ్ముతున్న కెసిఆర్ , కాకతీయులు గుంటూరు ప్రాంతాన్ని పరిపాలించారనే చరిత్ర ని చాల తెలివిగా మర్చిపోతున్నారు . కర్నూలు ని నిజాం నవాబు బ్రిటిషు వారికి కప్పం కిందా ఇవ్వకపోతే అది కూడా తెలంగాణ లో భాగమనే చరిత్ర మా తెలంగాణ మేధావులకి ఇప్పుడు తెలంగాణా ప్రాంతం లో ఉన్న నాలాంటి వాడు గుర్తు చెయ్యక పోతే , చరిత్ర ఇప్పుడు జై తెలంగాణా అని నినదిస్తున్న అమాయకులని క్షమించదు .

మనం ముందుగా భారతీయులం , తరువాతనే తెలుగు వారం , గర్వించదగ్గ తెలుగు కి వారసులం .

ఐకమత్యమే మహా బలం అని ఉగ్గుపాల తో నేర్చుకున్న పాటల్ని మరచిపోము . ఆంధ్ర ప్రదేశ్ ని ఆఫ్రికా లాగ మార్చే కుట్ర ని ఎదుర్కొంటాం . నాలాంటి తెలంగాణా హృదయాలు ఇంకా చాల ఉన్నాయి.
ప్రతి ప్రాంతానికి ఒక యాస ఉంటుంది , శ్రీకాకుళం యాస నెల్లూరు వాడికి అర్థం కాదు , అదిలాబాదు యాస నాలాంటి పాలమూరు వాడికి అర్థం కాదు , అంత మాత్రాన అది తెలుగు కాదా?

ఎవడో వాడి సినిమా లో తెలంగాణా యాస ని అవహేళన చేస్తే మనం తన్నుకుని చావాలా? ఇప్పుడు మరాఠా వాడి చేతిలో తన్నులు తిందామా?

మనం అంతా భారతీయులం అనుకుంటే విచిత్రంగా అనిపించే స్థితి కి తీసుకెళ్లటం ఆయన లక్ష్యం .

మనుషుల్ని మనసుల్ని విడగొట్టి పాలించాలను కునే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని తరిమి కొట్టే రోజు ఇంకెంతో దూరం లేదు .

Thursday, July 22, 2010

ఎందుకో మరి teliyadu

చంద్ర బాబు బాబ్లి యాత్ర తెలుగు వారికి ఒక గుణపాతం అవుతుందేమో chooddaaam

Saturday, July 17, 2010

సినిమా సినిమా ఎందుకిలా?

ఎందుకో మనం సినిమా ల విషయం లో చాల విశాల మనస్తత్వం తో ఉంటాం కదూ?
ముఖ్యం గా తెలుగు సినిమాలో హిందూ దేవతలు వినోదాన్ని పంచుతున్నారు . గుళ్ళలో ఫైటింగ్ దృశ్యాలు . చాల బావుంది , జనం డెవలప్ అయ్యారు .
శ్రీ కృష్ణ అంటే చాలు పెద్ద కాసనోవ క్యారెక్టర్ ఇప్పుడు మనకి . వేదం అనే పేరుతో నాటు మనుషుల పరివర్తన సినిమా , వేదం పోస్టర్ లో ఒక వేశ్య . ఇప్పటి జేనేరాసన్ పిల్లలు వేదం అంటే ఎం గుర్తు పెట్టుకుంటారు ? మంచి ప్రయత్నం చేసారు క్రిష్ . వేదం ని సింపుల్ గా చెప్పారు . ఎంత టాలెంట్ ఉందొ ఇక్కడ . అబ్బో !!
అదుర్స్ సినిమా లో ఒక సాంగ్ లో మహా విష్ణు విశ్వరూపం ఉన్న ప్రతిమ ముందు హీరో హీరొయిన్ గంతులు అబ్బో చెప్పలేం ఇక !!

మనం ఏమీ చేయలేమనే కదూ ఇలా జరుగుతుంది !!

చూద్దాం ,

మన సంస్కృతి సంప్రదాయాలని అవమానిచాలంటే భయపడే విధం గా ఒక గుణపాటం చెబుదాం , ఒక్కరికే , మిగతా వాళ్ళు వాల్లే బాగుపడతారు.

సోంపేట లో ఏం జరుగుతుంది ?

నా మీత్రులారా

మనకి కావాల్సింది ఏంటో మనం తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది . ఒకరు అభివృద్ధి అని ఇంకొకరు బతుకు పోరాటం అని అంధకారం లో మనల్ని ఇంకా ఎంత కాలం ఉంచగలరు ?

మనకు కావాల్సిన కరెంట్, సాగునీరు , త్రాగు నీరు , ఆహారం మన సమాజం నుండే రావాలి , అవి ఇంట్లో చేసే సదుపాయాలు కావు , సమాజం కోసం సమాజం చేసుకునే సమతుల్యమైన ఒప్పందాలాంటి అమరిక .
పక్క వాడికోసం ఏమీ చేయాలేని వాడికి సమాజం లో బ్రతికే అర్హత లేదు. నాగార్జున సాగర ఎంతో మందిపొలాలు , ఇల్లు కోల్పోయారు, మరి అలా కాకుండా ఉన్డి ఉంటె, ఇవ్వాళ కోస్తాప్రాంతఅం లో ఇంత పచదనం ఉండేదా ?
థెర్మల్ పవర్ ప్లాంట్ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపడం ఖాయం . దానివల్ల ఉపాది కోల్పోయే వారికి సరియిన ప్రత్యామ్నాయ ఉపాది చూపించాలి , అంతే కాడి గుడ్డిగా వ్యతిరేకించటం కాదు .
మావుఇస్ట్ చఇన లో కూడా థెర్మల్ ప్లాంట్ ఉన్నాయి . దయచేసి ఆలోచించండి