Friday, July 23, 2010

ఐకమత్యం బలం కాదా??

మన ఘనత వహించిన కెసిఆర్ మనుషుల్ని మనసుల్ని విడగొట్టడం లో నిష్ణాతుడు .
ఆయన చరిత్ర ని కూడా విడగోడుతున్నాడు . శ్రీనాథ మహాకవి ని కోస్తా కవిగా , రామదాసు ని తెలంగాణా కవి గా, అన్నమయ్య ని రాయలసీమ కవి గా విడగొట్టి పారేసాడు . అసలు అప్పుడు తెలంగాణా ప్రాంతం విడిగా ఉండేదా? అసలు ఆ మాట ఉండేదా? కేవలం నిజాం ఆక్రమించిన తెలుగు ప్రాంతాలు ౧౯౪౭ తరువాత పరిగణ లోకి వచ్చిన తెలంగాణా అనే పదాన్ని పట్టుకుని విషం చిమ్ముతున్న కెసిఆర్ , కాకతీయులు గుంటూరు ప్రాంతాన్ని పరిపాలించారనే చరిత్ర ని చాల తెలివిగా మర్చిపోతున్నారు . కర్నూలు ని నిజాం నవాబు బ్రిటిషు వారికి కప్పం కిందా ఇవ్వకపోతే అది కూడా తెలంగాణ లో భాగమనే చరిత్ర మా తెలంగాణ మేధావులకి ఇప్పుడు తెలంగాణా ప్రాంతం లో ఉన్న నాలాంటి వాడు గుర్తు చెయ్యక పోతే , చరిత్ర ఇప్పుడు జై తెలంగాణా అని నినదిస్తున్న అమాయకులని క్షమించదు .

మనం ముందుగా భారతీయులం , తరువాతనే తెలుగు వారం , గర్వించదగ్గ తెలుగు కి వారసులం .

ఐకమత్యమే మహా బలం అని ఉగ్గుపాల తో నేర్చుకున్న పాటల్ని మరచిపోము . ఆంధ్ర ప్రదేశ్ ని ఆఫ్రికా లాగ మార్చే కుట్ర ని ఎదుర్కొంటాం . నాలాంటి తెలంగాణా హృదయాలు ఇంకా చాల ఉన్నాయి.
ప్రతి ప్రాంతానికి ఒక యాస ఉంటుంది , శ్రీకాకుళం యాస నెల్లూరు వాడికి అర్థం కాదు , అదిలాబాదు యాస నాలాంటి పాలమూరు వాడికి అర్థం కాదు , అంత మాత్రాన అది తెలుగు కాదా?

ఎవడో వాడి సినిమా లో తెలంగాణా యాస ని అవహేళన చేస్తే మనం తన్నుకుని చావాలా? ఇప్పుడు మరాఠా వాడి చేతిలో తన్నులు తిందామా?

మనం అంతా భారతీయులం అనుకుంటే విచిత్రంగా అనిపించే స్థితి కి తీసుకెళ్లటం ఆయన లక్ష్యం .

మనుషుల్ని మనసుల్ని విడగొట్టి పాలించాలను కునే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని తరిమి కొట్టే రోజు ఇంకెంతో దూరం లేదు .

No comments: