Friday, July 23, 2010

డార్జీలింగ్ , ఈశాన్య భారతం లో నిశబ్దానికి అర్థం ?

జై హింద్ , నా తోటి భారతీయులారా !!!

ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం పిల్లల క్లాసు పుస్తకాలలో పనికి రానిఊకదంపుడు పేజీలు నింపడం కాదు . ఒక్కసారి ఆలోచించండి , మనం భారతీయులం అనే భావన చిన్నపుడే బలం గా మనస్సులు నాటుకోవాలి. దీనికోసం మన సంస్కృతి సంప్రదాయాలని తెలుసుకోవడానికి పిల్లల్ని దేశం లో ఇతర ప్రాంతాలకు పంపాలి. ఇది ఒక కార్యక్రం లా గా సిల్లబాస్ లో చేర్చాలి . లేదంటే మన దేశం లో మనమే పరాయి వాళ్ళల లాగ ఉండాల్సి వస్తుంది .
ఈశాన్య భరతం లోని వారికి భారత దేశం తో పెద్దగాసంబంధం అవసరం లేదు , వాళ్ళు మనల్ని కేవలం దోపిడీ దారుల్లగా నే చూస్తున్నారు , ఎంత అవమానకరం ?
మిజోరం, లేదా నాగాలాండ్ ముఖ్యమంత్రి ఎవరో మనలో ఎంత మందికి తెలుసు? మరి భారత ప్రధాని ఎవరో వారికి ఎం అవసరం? అందుకే నిజం చెప్పాలంటే వారు తమని తాము పరిపాలించుకొనే పరిస్తితి లో లేరు కాబట్టే ఇంకా వాళ్ళు ఇండియా లో కలిసి ఉన్నారు. ఇందులో భారతీయులు గర్వించ దగ్గ విషయం ఏమీ లేదు.
ఇప్పుడు చేయ గలిగే పరిష్కారం ఒక్కటే , సాంస్కృతిక సారుప్యత అర్థం చేసుకొనే అవకాసం కనీసం ఇప్పుడు మన తరువాతి తరాలకి అందించాలి . వీళ్ళని అక్కడికి పంపాలి , అక్కడి వారిని ఇక్కడకి ఆహ్వానిచాలి . ఏదో ఒకటి చేయాలి .
భారత మాత అనే ఒక భావన పటిష్టం గా ఉన్నపుడే , మనకు భవిష్యత్తు ఉంటుంది .

మీ సలహాలు ఏమైనా ఉంటె చెప్పండి..

No comments: